Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రూ.6000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం పట్టుకున్నారు. నాలా కన్వర్షన్ కోసం మండలంలోని ఎరడపల్లికి చెందిన ఓ రైతు నాలా కన్వర్షన్ అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సమగ్ర విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచనున్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు.






