Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వేసంగి పొలాలు దున్నుటకు రైతులు సిద్ధమైన వేల కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండీ నుండి సాగునీరు ఇవ్వాలనీ బీజేపి మాజీ మండల పార్టీ అధ్యకుడు నర్రా శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం నీళ్ళు ఇవ్వనందున నారు ముదిరిపోయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు నియోజక ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు స్పందించి కాకతీయ కాలువ ద్వారా నీళ్ళు విడుదల చేయడానికి చొరవ చూపి రైతులు నష్టపోకుండా చూడాలని బీజేపి మాజీ మండల పార్టీ అధ్యకుడు నర్రా శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.






