Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు ఈరోజు హనుమకొండలో నిర్వహించిన కియో జపాన్ షోటోకాన్ జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు. విద్యార్థులను వివిధ సంవత్సరాల విభాగంలో ఎస్కే సదుల్లా బాబా కటాస్ లో గోల్డ్ మెడల్, 15 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో ఇంద్రనగర్ చెందిన జున్ను కావ్య కటాస్ లోబంగారు పథకం, 12 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో యండి హుమేరా తస్లీమ్ కటాస్ లో గోల్డ్ మెడల్, 8 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో జి నక్షత్ర కటాస్ లో గోల్డ్ మెడల్, 11 సంవత్సరాల విభాగంలో సిహెచ్ సాయి చరణ్ కటాస్ లో గోల్డ్ మెడల్, 13 సంవత్సరాల విభాగంలో సిహెచ్ ఆదిత్య వర్ధన్ కటాస్ లో సిల్వర్ మెడల్ సాధించినట్లుగానే తెలిపారు. కాగా ఈ కరాటే పోటీలలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులను హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, హుజరాబాద్ టౌన్ ఎస్ఐ యూసుఫ్ అలీ, ఏఎంసి మాజీ డైరెక్టర్ ఖాలిద్ హుస్సేన్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అలీమ్, జ్యోతిరావు పూలే జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఫ్రూట్స్ మొహమ్మద్ సలీం, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, డైరెక్టర్ గోపాల్, డైరెక్టర్ వెంగళరావు, గోస్కుల మధు, ఎండి తౌఫిక్, గ్లోబల్ షోటో ఖాన్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్, తులసి లక్ష్మణమూర్తి తదితరులు అభినందించారు.






