
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి పాడి సాయినాథ్ రెడ్డి ఇటీవల హార్ట్ స్ట్రోక్‌కు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలి AIG హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.







