
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఏడో వార్డులో రూ. నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సకాలంలో నాణ్యతతో పనులు చేపట్టి పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, ప్రతాప తిరుమల్ రెడ్డి, నాయకులు గంగిశెట్టి రాజు, కొలిపాక అజయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






