
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల గౌడ్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల సహకారము తో ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. జమ్మికుంట-కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వస్తున్న వాహనా దారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి..హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలంటూ వినూత్నంగా గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు అవే మనల్ని రక్షిస్తాయని విద్యార్థులు వాహనదారులకు సూచనలు చేశారు. అనంతరం సిఐ తిరుమల్ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ ను వివరించడం హర్షనీయమన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారంగా వాహనాలను నడపాలని సూచించారు. అతివేగం అజాగ్రత్తగా నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని సూచించారు. వాహనాల వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, మద్యం సేవించడం ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ తో పాటు కేరళ పాఠశాల విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








