Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ హై స్కూల్ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 2023-24 విద్యా సంవత్సరం ముగియకముందే 2025-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆల్ఫోర్స్ జీనియస్ హై స్కూల్ పాఠశాల మీద చర్యలు తీసుకొని పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని మండల విద్యాధికారి బి శ్రీనివాస్ కి బీసీ అజాది స్టూడెంట్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ పిర్యాదు చేశారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా హోల్డింగ్స్ మరియు ఫ్లెక్స్ బోర్డ్స్ ను వెంటనే తొలిగించి చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంగం నాయకులు మహేష్, అభిషేక్, అజయ్, సాయిగణేష్ తదితరులు పాల్కొన్నారు.






