
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నవభారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ మాలల జే ఏ సి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మాల మహానాడు నాయకులు రాష్ట్ర బి.జే.పి పార్టీ కార్యాలయ ముట్టడి కి వెళ్తున్న స్ధానిక నాయకులను ఈ రోజు అర్థరాత్రి హుజురాబాద్ పోలీసులు వారి ఇండ్లకు వెళ్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ మనువాద మంత్రి అమిత్ షా ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టు చేసిన నాయకులను సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొల్లు బాబు, రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి, జిల్లా నాయకులు తొగరు స్వామి, నీరటి రమేశ్ కుమార్, తొగరు సంపత్ తదితరులు పాల్గొన్నారు.







