
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (నిర్మల్) : ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనకు జీవిత భీమా సంస్థ ఎజెంట్లు సంపూర్ణ మద్దతు తెలపడం పట్ల కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ డా వి.నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో LIC ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన నరేందర్ రెడ్డికి LIC ఉద్యోగులు బ్యాండ్ మేళంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆయనసంవత్సరాలనుండి మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా ఉంటూ నిరుద్యోగ సమస్య ను నిర్మలించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి నాలుగు జిల్లాల చాలా చోట్ల గ్రంధాలయాల్లో మౌళిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు..
LIC ఉద్యోగులు సంఘం అధ్యక్షులు గాండ్ల నారాయణ మాట్లాడుతూ. గత 34 సంవత్సరాలనుండి ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పడమే కాకుండా..చాలా మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందజేస్తూ ప్రత్యేక్షంగా, పరోక్షంగా 5000 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశలు కల్పిస్తున్న నరేందర్ రెడ్డి పార్టీలకతంగా స్వచ్ఛందంగా మద్దతిస్తామని వెల్లడించారు.. ఎల్ఐసి రంగంలో ఉద్యోగం చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి కి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల నారాయణ, నాగుల శ్రీనివాస్, గంగాధర్, వినోద్ కుమార్, రమేష్, జీవన్, భాస్కర్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు..
–డీసీసీ అధ్యక్షుడిని కలసిన నరేందర్ రెడ్డి
నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుచాడి
శ్రీహరిరావుని సోమవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పూల బోకెను అందజేసి శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..










