Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పులుపు మేరకు, వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏపూరి సోమన్న నేతృత్వంలో ఫిబ్రవరి 7వ తారీకు నాడు జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఆకినపెళ్లి శిరీష నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీకు నాడు జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. హక్కుల కోసం మొదటిసారి డప్పులు కొడుతున్నం -జనవరి 7 నుంచి కళానాయకుల కవాతు
-మాదిగలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
-ప్రజా గాయకుడు రామంచ భరత్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడు తున్నారని, వారు చేపట్టిన మాదిగ కళా నాయకుల కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించాలని వార్డు మెంబర్ నుండి పార్లమెంటు సభ్యుని వరకు అటెండర్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మనిషికో డప్పు కొనుక్కుని కదలిరావాలని పిలుపునిచ్చారు. వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఆకినపల్లి శిరీష ప్రవీణ్ ని నియమించడం జరిగిందనీ రామంచ భరత్ తెలిపారు.






