
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో గత నెల 28వ తేదీన ఆకుల కొమురయ్య అనే ఆ సామి ఈత చెట్లను దౌర్జన్యంగా తొలగించాడు. గీతా కార్మికుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈత చెట్లను పెంచాలని అధికారికంగా కార్యక్రమాలు చేపట్టి మొక్కలు నాటుతున్నప్పటికీ వాటిని పట్టించుకున్న పాపాన పోవడమే కాకుండా ఈత చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గీతా కార్మికులు గత 12 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల గీతా కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గీతా కార్మికులు మాట్లాడుతూ.. గత నెల 28వ తేదీన చెట్లను తొలగించిన ఆకుల కొమురయ్య పై ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అప్పటినుండి ఇప్పటివరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిశీలనకు మాత్రం రాకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయం గురించి ఎక్సైజ్ సిఐని కలిసేందుకు కార్యాలయంకు వెళ్లగా అక్కడ విధులలో ఉన్న ఎస్సై సౌమ్య గీతా కార్మికులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ వాటి వల్ల ఏమీ ఉపయోగం అంటూ మాట్లాడుతూ కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడిందని వారు పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ఎక్సైజ్ అధికారులే దౌర్జన్యంగా వాటి తొలగించిన వారికి వత్తాసు పలుకుతూ మామూళ్లకు తలుగుతున్నారని పలువురు గీతా కార్మికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.






