
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకర్తగా రూపొందించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి అయ్యిందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడీ రామారావు అన్నారు.



అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు..
భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హుజురాబాద్ బస్టాండ్ ప్రథాన కూడలిలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోలాడి రామారావు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ సమాజంలో విభిన్న వర్గాల్లో అంతరాలు పెరుగ కుండా ఉండేందుకు సమానత్వం స్వేచ్ఛ భావ వ్యక్తీకరణతో కూడిన నవ సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు.
భారత దేశాన్ని లోకిక గణతంత్ర, ప్రజా స్వామిక రాజ్యాంగా తీర్చి దిద్దేందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనదన్నారు.
సాధారణమైన వ్యక్తి గత కష్టాలను అవమానాలను ఎదుర్కొని స్థిరమైన అభిప్రాయాలతో ఉండి ఎన్నో ఉన్నత మైన చదువులు చదివిన అంబేద్కర్ దేశ రాజ్యాంగానికి ప్రథాన రూప కర్త అయ్యారన్నారు.
అంబేద్కర్ తన జీవితమంతా సమానత్వం తో కూడిన చట్టపర మైన, నైతిక ధర్మాన్ని నిర్మించడంలో గడిపి ఆదర్శ ప్రాయులుగా నిలిచారన్నారు.

సభా వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పోలాడి రామారావు..
అంబేద్కర్ దార్శనికత మూలంగానే రాజ్యాంగ బద్దంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు. జాతీయ స్థాయిలో ఓసిల జనాభా 30శాతం ఉండగా రాష్ట్రంలో 21.5శాతం పటాన్లు సయ్యద్ లతో కలిపి ఉండగా, ఆర్ధికంగా వెనుకబడిన ఓసి సామాజిక వర్గీయుల పేదలకు అంబేద్కర్ రచించిన అందరికీ సమన్యాయం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించిందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆర్ధికంగా వెనుకబడిన అన్నీ వర్గాల్లోనీ పేదలందరికీ సమ న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని మారుతున్న పరిస్థితుల కారణంగాఆట్టడుగున ఉన్న పేదలకు రిజర్వేషన్ల ఫలాలు అందటానికి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమీలేయర్ పద్దతి అమలు చేయటానికి ప్రత్యేక చట్టం తేవాలని రామారావు కోరారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వేడుకలు కేవలం ఒక స్మరణ పండుగ మాత్రమే కాదని ఇది దేశానికి ఒక మైలు రాయి లాంటిదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం పాటు పడుదామన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ఎక్కడ అన్యాయం జరుగుంతో పాలకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తారో అక్కడే గట్టిగా పోరాడు సాధించు అనే లక్ష్యానికి అనుగుణంగా పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, దేశానికి అన్నం పెట్టే అన్నదాతల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల ఏప్రిల్ 28 మంగళవారం రోజున సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్షలాది మందితో చారిత్రాత్మకంగా నిర్వహించే రాష్ట్ర వ్యాప్త రైతు మహా గర్జన సమర భేరి సభకు పార్టీల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చి విజయ వంతం చేయాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.






