
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో యూటర్న్స్ వల్ల అనేక మార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య గురించి యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ ఆర్ అండ్ బి కార్యాలయంలో (ఏఈఈ )సాయి కృషికి వినతి పత్రం అందజేశారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సమస్య తీవ్రతను అధికారుల వివరించారు. ఈ సందర్భంగా బుడిగె శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. జమ్మికుంట నుండి హుజురాబాద్ రోడ్డుకు వెళ్లే దారిలో డివైడర్ కు సంబంధించి దగ్గర దగ్గరలో యూటర్న్ ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. అదే విధంగా ఫంక్షన్ హాల్స్, మిల్లులు, బార్, హోటల్స్ లాంటివి రోడ్డును అనుకొని ఉన్నందున నిత్యం ఆ చోట రద్దిగా ఉంటుందని తెలిపారు. అక్కడ డివైడర్ తొలగించి ఉండడం వల్ల ఎవరికి వీలుగా వాళ్ళు వాహనాలతో రోడ్డు క్రాస్ చేయడం వల్ల, రోడ్డు ప్రమాద సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వివరించారు. ఈ ప్రమాదాల వల్ల కాలినడకన వెళ్లే వారికి కూడా భద్రత లేదని అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. కాగా వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యల తీవ్రతను పర్యవేక్షించడం జరిగిందని ఇట్టి సమస్యపై, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబుకి ఫోన్ కాల్ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారని తెలిపారు. అధికారులు ఈ సమస్య పట్ల వెంటనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని మాట్లాడారు.









