
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి రచయిత సామాజికవేత్త సాహితీవేత్త తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక అత్యుత్తమ సేవలను భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వీరిని భారత్ వరల్డ్ రికార్డు అవార్డుకు ఎంపిక చేసి అందజేశారు. ఈ అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతిలో గురువారం భారత్ వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకులు కదిరి వెంకటరమణరావుతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి ఫార్మర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్టర్, చకిలం అసోసియేషన్ డైరెక్టర్ చకిలం సుధాకర్, ప్రజ కవి తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యంగౌడ్, ఇంటర్నేషనల్ ఫిలిం జూరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కమిటీ డాక్టర్ నాగులపల్లి పద్మిని, టీవీ అండ్ మూవీ ఆర్టిస్టు బేబీ శ్రీదేవి సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి, మెడలో రికార్డు ఐడి కార్డు ధరింపజేసి, జేబుకు భారత్ వరల్డ్ రికార్డు మెడల్‌ను ధరింపజేసి, ప్రపంచ భారత్ వరల్డ్ రికార్డు అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారత్ వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకులు కదిరి వెంకట రమణరావుతో పాటు ముఖ్య అతిథులు సముద్రాల వేణుగోపాలచారి, పద్మిని, చకిలం సుధాకర్ మాట్లాడుతూ సత్యంగౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని, ముఖ్యంగా విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగాలనే సంకల్పంతో సెమినార్లు నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదగాలని కాంక్షించే సత్యంగౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయం అన్నారు. కవిగా, రచయితగా సమాజానికి ఉపయోగపడే రచనలు రాణిస్తూ, ఆవిష్కరిస్తూ .. విలువలు పెంపొందించే రచనలు చేస్తున్న సత్యంగౌడ్ రచనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నవనీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, బోధన చేస్తు.. ఆధ్యాత్మిక గురువుగా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన సత్యగౌడ్ బోధనలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రజాకవి రచయిత తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని, మంచి మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో జీవిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో, దేశభక్తిలో ముందంజలో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలన్నారు. ఎందరో నృత్య కళాకారులను, కవులను, కళాకారులను, సామాజిక వేత్తలను, సమాజానికి ఉపయోగపడే విద్యావేత్తలను, ప్రోత్సహిస్తూ కలనే వృత్తిగా దైవంగా భావిస్తూ ఎందరికో సత్కారాలు అవార్డులు, వరల్డ్ రికార్డు అవార్డులు అందజేస్తున్న అంతర్జాతీయ భారత్ వరాలు రికార్డు సంస్థ వ్యవస్థాపకులు కదిరి వెంకట రమణారావు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, గురువులు, విద్యావేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ సంస్థల డైరెక్టర్లు, చైర్మన్లు, న్యాయవాదులు, చిన్నారులు నృత్య కళాకారుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.


