
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,జనవరి 09: చదువుకున్న కళాశాలను మరవకూడదనే ఉద్ద్యేశంతో, ఆ కళాశాలలో ఉన్న నీటి సమస్యను గుర్తించి మేమున్నాం అని ముందుకు వచ్చారు పూర్వ విద్యార్థులు. హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం 1986 – 88 ఎం బైపిసి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ” మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ” సంస్థ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థుల మంచినీటి (తాగునీటి) కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు కై 25 వేల రూపాయల చెక్కును కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావుకు పూర్వ విద్యార్థులు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుజ్జుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, కార్యదర్శి గుంటి రవీందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొర్ని సమ్మిరెడ్డి, ఫక్రుద్దీన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, కేసరి మధుకర్ రావు, చోల్లెటి గంగాధర్, దేవత రవి, విజయ నిర్మల, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేల్పుల రత్నం, కళాశాల అధ్యాపకులు తులసీదాస్, మురళి, మనోహర్, విజయేందర్ రెడ్డి, వాసుదేవరావు, పున్నం చందర్, మహిళా అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


