Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఎస్.కె జలీల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఉర్దూ మీడియం హై స్కూల్ లోని ఘనంగా నిర్వహించారు. దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు పోవడానికి సావిత్రిబాయి పూలేతో కలిసి ఫాతిమా షేక్ అనేక ఉద్యమాలు చేసి పాఠశాలలు నడుపారన్నారు. వారి ప్రోత్సాహం వల్లనే మహిళలు అన్ని విభాగాలలో రాణించ గలుగుతున్నారన్నారు. విద్యతోనే అన్ని సమస్యకు పరిష్కారం అని నమ్మిన ఫాతిమా షేక్ జయంతి నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని, వారి ఆశయాలను కొనసాగించాలని మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సమాజసేవలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకుడు సొల్లు బాబు, అంబేద్కర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఎక్సైజ్ ఎస్సై వినోద్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి మండల ప్రెసెంట్ కిరణ్, మాజీ అధ్యక్షులు ఖాజీపేట శ్రీనివాస్, కాంగ్రెస్ మైనార్టీ టౌన్ మాజీ ప్రెసిడెంట్ ఎండి అప్సర్, కాంగ్రెస్ నాయకులు తౌసిప్, మొహమ్మద్ అలీమ్, రెండోవార్డు కౌన్సిలర్ యాదగిరి నాయక్, 17వ వార్డ్ కౌన్సిలర్ ఉస్మా నూరిన్ ఇమ్రాన్, నాయకులు రత్నం, ఎండి బాబా, ఎండి మున్ను, గోస్కుల మధు, లక్షణామూర్తి, ఎండి అజ్జు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.






