
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(సైదాపూర్): ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా సైదాపూర్ మండలం వెన్నంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో రంగవల్లుల పోటీలను నిర్వహించగా పలువురుని ఎంతకాలం అలరించాయి. ఈ పోటీలలో విద్యార్థులు అధ్యంతం ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఆలోచన విధానాన్ని రంగవల్లులలో ప్రతిబింబించారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, పరిజ్ఞానము మొదలైన అంశాలలో వారు రంగవల్లులను వేసి తమ ఆలోచన విధానాన్ని తమ బాధ్యతను తమ యొక్క విశాల దృక్పథాన్ని ప్రతిబింబించారని ప్రధానోపాధ్యాయులు రాయిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వ్యక్తము చేశారు. ఇదే రకంగా విద్యార్థులు మిగతా కార్యక్రమాలలో కూడా ఇదే రకమైన ఉత్సాహంతో పాల్గొనాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తీరైన రంగులతో వేసిన రంగవల్లులు మన సంస్కృతితో పాటు సామాజిక పర్యావరణ రహిత పర్యావరణ సహిత విషయాలను వివరించాలని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కే శ్రీనివాస్ రెడ్డి, టీజై గోపాల్ సింగ్, వి ప్రవీణ్ కుమార్, కే సత్యనారాయణరెడ్డి, కుమార్ ,సత్య, జయప్రద, పద్మ, జ్యోతి, నలిని, మరియు సిఆర్పి రమేష్ పాల్గొన్నారు.









