
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,జనవరి 10: సంక్రాంతి సందర్భంగా హుజురాబాద్ కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కోర్టులోని మహిళ న్యాయవాదులతో పాటు వివిధ కోర్టులలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం హుజురాబాద్ సబ్ జడ్జీ పిబి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జీ పి.ఆలేఖ్య, మేజిస్ట్రేట్ లు గెడెం స్వాతి, పద్మ సాయిశ్రీ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. కాగా మొదటి బహుమతి మహిళా న్యాయవాదులను వరించగా, రెండవ బహుమతి రెండవ అడిషనల్ కోర్టు సిబ్బంది, మూడవ బహుమతి సబ్ కోర్టు సిబ్బంది గెలుచుకోగా జూనియర్ సివిల్ కోర్టు సిబ్బంది, మొదటి అడిషనల్ కోర్టు సిబ్బంది కన్సోలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోయేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, కార్యదర్శి మట్టెల తిరుపతి, ఉపాధ్యక్షులు బండి రమేష్, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.








