Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షుడిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన కుడికాల ప్రభాకర్ ఎన్నికయ్యారు. నిన్న కరీంనగర్ లోని కళాభారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్ ను కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. 1983 నుండి నాటకాలనే మక్కువతో మా గురువుగారైన తుపాకుల మొగులయ్య ఆశీస్సులతో ఈ నాటక రంగంలో పాల్గొంటున్నాను అన్నారు. దాదాపుగా ఒక ఏడు ఎనిమిది నాటకాలు వేసామని, హైదరాబాద్ బిహెచ్ఎల్, వర్ధన్నపేట, వరంగల్, కరీంనగర్, రాజమండ్రి, కర్నూలు తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చామని ప్రభాకర్ గుర్తు చేశారు. హుజురాబాద్ కాకతీయ కళా సమితి సంస్థ సభ్యులు బండ కిషన్, ముదాం కుమారస్వామి, కుడికాల ప్రభాకర్, గోసికొండ మృత్యుంజయ, సంఘ వీరస్వామి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాచపల్లి రాములు, కుడికాల దామోదర్ తదితరులు ప్రభాకర్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.






