Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఈరోజు కరీంనగర్లోని వారి నివాసంలో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం కి ఈజీఎస్ నిధుల కింద కేటాయించిన పనులు కాకుండా మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మరియు బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావులు కోరారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రణాళికలు చేయాలని అదేవిధంగా స్థానిక సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అప్పుడే స్థానిక సంస్థలు గెలుపొందే అవకాశం ఉంటుందని అన్నారు.






