
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 10: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భముగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పతంగుల పోటీలు నిర్వహించగా చైర్ పర్సన్ రాధిక కౌన్సిలర్ రమాదేవిలు న్యాయ నిర్నేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక బల్దియా నుండి కళాశాలకు బోర్ మోటార్ ను మంజూరు చేయగా కృతజ్ఞతలు తెలిపి ఆమె పదవీకాలం ముగియనుండడంతో ఆమెను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కే రమాదేవి, కళాశాల ప్రిన్సిపల్ వీ ఆంజనేయరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే సుగుణ, మహిళా అధ్యాపకులు రేణుకా, శైలజ, సుహాసిని, రజిత, రజినీ, జ్యోతి, వనమాల, అధ్యాపకులు ప్రసాద్, విజేందర్ రెడ్డి, రాజశేఖర్, పున్నం చందర్, కళాశాల సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.












