
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం పాలాభిషేకం నిర్వహించారు. నిన్న యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు అవమానం చేయగా నేడు అక్కడే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని అడుగడుగునా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నాయకులను అడ్డుకుంటుండడంతో జీర్ణించుకోలేక కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేశారని అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ ఫిరాయింపుదారులను నిలదీసిన కౌశిక్ రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూశారని కోర్టులో వారి ఆగడాలు నడవకపోవడంతో కౌశిక్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను నిలదీస్తూ ప్రభుత్వ పెద్దలను అడ్డుకుంటున్న కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసి చులకన చేయాలని చూస్తే కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెప్తామని టిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మరోసారి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జోలికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసిన సహించేది లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధికా శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండ శ్రీనివాస్, వి రవీందర్రావు, పలువురు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కౌశిక్ రెడ్డి ఫాలోవర్స్, అభిమానులు పాల్గొన్నారు.









