
–ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చదువుకున్న నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఆ విద్యార్థులు… తమ అనుభవాలను… గత స్మృతులను నెమరు వేసుకొని ఆత్మీయ సభ అపూర్వం… అద్వితీయంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-82 సంవత్సరంలో ఇంటర్ చదివిన విద్యార్థిని, విద్యార్థులు తమ గురువులతో కలిసి నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సరిగ్గా 43 సంవత్సరాల క్రితం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న తాము క్రమశిక్షణకు మారుపేరుగా నిబద్ధతతో కష్టపడి అధ్యాపకులు చెప్పిన దానిని పాటించి ప్రస్తుతం జూనియర్ కళాశాలలో అత్యధికంగా ఉద్యోగాలు పొందిన బ్యాచిగా తమ బ్యాచ్ ఉండడం గర్వకారణం అన్నారు. తల్లిదండ్రుల, గురువుల కలలను నిజం చేస్తూ తాము ఉన్నత చదువులు చదివామని అలాగే ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయిలో నిలిచామని అది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గర్వకారణంగా మేము భావిస్తున్నామని అన్నారు. మాలో ఒకరు ఏసీపీగా, వైద్యులుగా, ఒకరు రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తగా, ఉపాధ్యాయులుగా, వ్యవసాయదారులుగా, ఇతర ఉద్యోగాలు చేస్తూ మంచి పౌరులుగా ఉన్నామని, మా పిల్లలను సైతం ఉన్నత మార్గాన పైనించే విధంగా చేయడం తమ ఉపాధ్యాయుల గొప్పతనం అని అన్నారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత జీవిత పయనాల గురించి పలువురు వివరించి వారికి వివిధ సందర్భాల్లో సహాయం చేసిన వ్యక్తులను గుర్తు చేసుకున్నారు. 43 సంవత్సరాల అనంతరం తిరిగి కలుసుకొని అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న వారి కృషి గొప్పదని కొనియాడారు. అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపల్ సి వీరయ్య మాట్లాడుతూ…అప్పటికి ఇప్పటికి తమ వద్ద చదువుకున్న పిల్లలు గొప్పవారుగా మారాలనేదే మా లక్ష్యంగా ఉండేది అన్నారు. మురళీధర్ రావు మాట్లాడుతూ…కాలేజీ పిల్లలైనా క్రమశిక్షణతో ఉండి చదువుకున్నారని అందువల్లనే ఈ బ్యాచ్ లో ఎక్కువమంది ఉద్యోగాలు పొందారని అన్నారు. అప్పటి కాలేజీ సంగతులు ఉపాధ్యాయులతో తాము మెదిలిన సంఘటనలు ప్రవర్తించిన తీరులు గుర్తు చేసుకున్నారు. తమకు బోధించిన అధ్యాపకులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పటి అధ్యాపకులు సి.వీరయ్య, మల్లా రెడ్డి, మురదర్ రావు, అత్మారాం, పాపయ్య, జవహర్, అనుమాoడ్ల ప్రసాద్ రెడ్డి, గోలి శ్రీనివాస్, చంద్రగిరి మల్లేశం,
సంజీవరెడ్డి, బెదరకోట జనార్ధన్, అకినపల్లి శ్రీనివాస్, డాక్టర్ పోలు శ్రీనివాస్, కొత్త నాగిరెడ్డి, విడపు రాజు, చంద్రగిరి మల్లేశం, సాయన్న, లింగమూర్తి, డేవిడ్ రాజు, రవీందర్, పరాంకుశం కరుణశ్రీ, ఖైరునిసా బేగం, సరోజ, రేఖ, భారతి, రేవతి, చందా సుకన్య, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
—కలుసుకోవడం ఆనందదాయకం
—పరాంకుశం కరుణశ్రీ
చదువుకున్న 43 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకోవడం, నాటి విషయాలను స్మరించుకోవడం ఆనందదాయకమని తెలుగు ఉపాధ్యాయిని పరాంకుశం కరుణశ్రీ అన్నారు.

—నాటి పునాదితోనే నేటి ముందడుగు.
—గోలి శ్రీనివాస్
నాలుగు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయులు వేసిన పునాదితోనే నేటి ముందడుగు అని వ్యాపారవేత్తగా స్థిరపడిన పూర్వ విద్యార్థి గోలి శ్రీనివాస్ అన్నారు.

––క్రమశిక్షణ మా ఎదుగుదలకు నాంది
—సబ్బని సరోజ
చదువుకున్నప్పటి నుంచి ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ మా ఎదుగుదలకు నాంది అని ఉపాధ్యాయురాలు సరోజా అన్నారు. నాటి క్రమశిక్షణ నాకు ఉద్యోగం లభించేందుకు తోడ్పడిందన్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక చిత్రాలు..












