
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న కంబాల రాములుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం హుజురాబాద్ మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల వనరుల కేంద్రం హుజురాబాద్ వద్ద DTF రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పలకల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాములు పై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ వ్యక్తులపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో DTF హుజురాబాద్ మండల బాధ్యులు ఎస్ చక్రధర్, అల్లి శ్రీనివాస్, కనకం వెంకటస్వామి, డి సదానందం, ఆర్ భాస్కర్, ఏం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, PRTU రాష్ట్ర నాయకులు మ్యాక రాములు తదితరులు పాల్గొన్నారు.








