
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి 14వ వార్డుకు చెందిన సమ్మెట సాయిరాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, త్వరగా గుండెకి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిసి హుజురాబాద్ కు చెందిన ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ సీఎంఓ ఆఫీస్ నుంచి రూ. లక్ష 25 వేల ఎల్ఓసి ఇప్పించి ఆదుకున్నాడు. సాయిరాం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆర్ధిక పరిస్థితి బాగాలేదని వెంకట్ అనుచరుడు మేడుదుల అర్జున్ ద్వారా తెలిసిన వెంటనే ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గంటల వ్యవధిలోనే వైద్యఖర్చుల కోసం కావాల్సిన రూ . 1,25,000 లు ఎల్ ఓ సి మంజూరు చేయించారన్నారు. ఎల్ ఓసితో పాటు సర్జరీ కి కావాల్సిన రక్తం కూడా వెంకట్ ఏర్పాటు చేసారని తెలిపారు. అడగకుండానే ఆదుకున్న సబ్బని వెంకట్ కు సాయిరాం కృతజ్ఞతలు తెలిపారు.



సాయిరాంకు మంజూరైన ఎల్ఓసి





