
–మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: గత ప్రభుత్వము తీసుకువచ్చిన అసంబద్ధమైన 317 జీవో వల్ల భార్య ఒక జిల్లా భర్త ఒక జిల్లాకు కేటాయించబడి నానా అవస్థలు పడ్డ ధరిమల ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వము స్పౌజ్ ఉపాధ్యాయులను ఒకే జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు స్పౌజ్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మండల ఆనందం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల ఆనందం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నిరంతర కృషి వల్ల మరియు స్పౌజు ఫోరం రాష్ట్ర నాయకులు వివేక్, నరేష్, గడ్డం కృష్ణ, ఖాదర్, త్రివేణి తదితరులు కలిసి పీఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతర పోరాటం చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్పౌజ్ ఉపాధ్యాయులను కలపాలని ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చొరవతో మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల ఆధ్వర్యంలో 317 సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
ఈ సబ్ కమిటీ స్పౌజ్ ఉపాధ్యాయులను కలిపేలా నివేదిక ఇచ్చిన సందర్భంగా నేడు 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు వారి స్పౌజ్ పని చేసే జిల్లాకు కేటాయించబడుతూ ఉత్తర్వులు రావడం వల్ల స్పౌజ్ ఉపాధ్యాయులు అందరూ ఆనందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, 317 త్రిసభ్య కమిటీ మంత్రులకు, మరియు పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ స్పౌజ్ ఉత్తర్వులు రావడానికి కృషి చేసిన అన్ని యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులకు స్పౌజ్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మండల ఆనందం ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ స్పౌజ్ ఉపాధ్యాయులను కలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవతా దృక్పథంతో మిగిలిపోయిన కొద్దిమంది ఉపాధ్యాయులను కూడా వారి స్పౌజ్ పనిచేసే జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా, మరియు 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను కూడా వారి సొంత జిల్లాకు కేటాయించేలా ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ బుర్ర నాగరాజు, విజయలక్ష్మి, కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ జక్కోజు వెంకటేశ్, చంద్రశేఖర్ రెడ్డి, కేతిరి శ్రీనివాస్ రెడ్డి, సరిత, ఉమాదేవి, రమేష్, లింగాల రాజు, స్వప్న, స్వర్ణలత, మరియు ఇతర జిల్లాల నుండి కరీంనగర్ జిల్లాకు కేటాయించబడిన 143 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







