
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 25వ తేదీ శనివారం హుజూరాబాద్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, హుజురాబాద్ ఎమ్మార్వో కనకయ్య తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో, ఓటర్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటర్లు, సీనియర్ సిటిజెన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
