
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన దివ్యాంగుల జాబ్ మేళాకు నిరుద్యోగ దివ్యాంగుల నుండి విశేష స్పందన లభించింది. హుజురాబాద్ పరిసర ప్రాంతాల నుండి జాబ్ మేళాకు 146 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ కల్పన చేయనున్నారు. కాగా జాబ్ మేళాను హుజురాబాద్ తహసిల్దార్ కే కనకయ్య, ఇన్చార్జి డిడబ్ల్యూ ఓ సబిత, హుజురాబాద్ సిడిపిఓ ఎం సుగుణ, సిడిపిఓలు కస్తూరి, శ్రీమతి, అంగన్వాడి సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు

