
–చైర్మన్ పుల్లూరి స్వప్న తల్లిదండ్రులు ఇద్దరు మాదిగలే అని తెల్చిచెప్పిన హైకోర్టు
–మార్కెట్ కమిటీ చైర్మన్ గా పుల్లూరి స్వప్నను పదవి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాల జారీ చేసిన హైకోర్టు
–జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న బీసీ అని తప్పుడు కేసులు వేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తాం
–తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత కొంతకాలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న పై ఆమె ఎస్సీ కాదు బీసీ అని అనేక ఫిర్యాదులతో పాటు హైకోర్టులో కేసు వేయడం చాలా బాధకారం అని తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న చైర్మన్ పదవి ఒక మాదిగ బిడ్డకు రావడంతో కొంత మంది జీర్ణించుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలతో చేసి గత రెండు నెలల నుండి స్వప్న ఎస్సీ కాదు బీసీ అని గతంలో హైకోర్టులో కేసు వేయగా ఫస్ట్ హై కోర్టు ఎలాంటి ఆధారాలు లేనందున కేసు కొట్టి వేసిందన్నారు. మళ్ళీ అనేక ఫిర్యాదులు చేస్తూ మరోసారి హైకోర్టులో కేసు వేశారని, హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులు, సిఐడి అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ల నుండి పుల్లూరు స్వప్న కులంపై పూర్తి ఆధారాల సేకరించి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. ఆ ఆధారాలతో పాటు మా హైకోర్టు అడ్వకేట్ జీడి రవితేజ పుల్లూరి స్వప్న తల్లి తండ్రి ఇద్దరు మాదిగ అనడానికి అనేక సాక్ష్యలతో కూడిన నివేదికను హైకోర్టుకు ఇవ్వడం జరిగిందన్నారు. గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జి ఈరోజు జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పుల్లూరు స్వప్న ఆమె బీసీ కాదని ఆమె మాదిగ కులానికి చెందిన వారని వారి తల్లి తండ్రి ఇద్దరు కూడా మాదిగ కులస్తులేనని హైకోర్టు ఈ రోజు తీర్పుని ఇవ్వడం జరిగిందన్నారు. మాదిగలకు పదవులు వస్తే జిర్ణించుకోలేక పోతున్నారని ఇప్పటికైనా కొంతమంది కుట్ర దారులు బుద్ధి తెచ్చుకోవాలని హితోవుపలుకుతున్నామన్నారు.






