
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం తుమ్మనపల్లి లో దిలీప్ బిల్డ్కాన్ కంపెనీ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 130 మందికి ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరంలో ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని మనోజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

