
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల అసోసియేషన్ నాయకత్వంలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు 11వ రాష్ట్ర మహాసభ ‘చలో హైదరాబాద్'(హయత్ నగర్) డిపో, బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందని డివిజన్ ప్రధాన కార్యదర్శి తవటం సంపత్ కుమార్, నాయకులు మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్ లు తెలిపారు. చలో హైదరాబాద్ మహాసభ కరపత్రాలను హుజురాబాద్ బస్ స్టాండ్ ఆవరణలో శనివారం ఆవిష్కరించారు. ఈ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారన్నారు. పలు సమస్యలు, రిటైర్మెంట్ కార్మికులకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, మెడికల్ స్కీమ్ లో చేరని వారికి అవకాశం కల్పించాలని, 2017లో వేతన సవరణ రావలసిన కార్మికులకు బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే లీవుల ఇన్క్యాస్మెంట్ పైసలు చెల్లించాలని, పెన్షన్ లేని కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు కార్మికులకు అందించాలని, రిటైర్మెంట్ కార్మికుడు చనిపోతే దహన సంస్కారులకు రూ.30,000 రూపాయలు అదే రోజు చెల్లించాలన్నారు. హైదరాబాదులో అసోసియేషన్ భవన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించాలని, అయ్యర్ పింఛన్లు కార్మికులకు అందవలసిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. చాలామంది కార్మికులకు పింఛన్ మంజూరు చేయడం లేదని, అప్పులు చేసి పిఎఫ్ బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. కొంతమంది కార్మికులు పింఛన్ మంజూరు కాకముందే చనిపోతున్నారని, ఇలాంటి పలు సమస్యలు పరిష్కరించాలని ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కరపత్రము ఆవిష్కరణ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి తవటం సంపత్ కుమార్, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, పేరాల లక్ష్మణ్ ,రావు, గూడూరు మల్లారెడ్డి, నరసయ్య, లింగయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.







