
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వల్లకాటి రాజ్ కుమార్ ఎన్నికైన తదుపరి రాష్ట్ర కార్యవర్గంలోకి హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణను “రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా”మరియు కాట్రపల్లి గ్రామానికి చెందిన చిలుకమారి శ్రీనివాస్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆవిర్భావము నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ పద్మశాలి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ రాష్ట్ర నాయకత్వం ప్రశంసలు పొందారు. అలాంటివారు నేడు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవడం, వారికి తగిన గుర్తింపు లభించడం, వీరి నియామకం పట్ల హుజురాబాద్ ప్రాంత పద్మశాలి కుల బాంధవులు హర్షం వ్యక్తం చేశారు. సంగెం సత్యనారాయణ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేసి నేడు రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం లభించడం పద్మశాలి సమాజం పట్ల అంకితభావంతో పనిచేయడం తగిన గుర్తింపు నిచ్చినట్లు అయిందని పలువురు పద్మశాలి కుల పెద్దలు అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా చిలుకమారి శ్రీనివాస్ కు రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసే అవకాశం లభించడం పద్మశాలి సమాజం పట్ల అంకితభావంతో పనిచేయడం ద్వారా తగిన గుర్తింపు లభించడం పట్ల పద్మశాలి కుల బంధువులు హర్షం వ్యక్తం చేశారు.


—————–+++++++++——+++———–
*పత్రికా ప్రకటనలు*
—————–+++++++——————–+

———————–+++++++++————————

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.





