
Oplus_131072
–రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విద్యాశాఖ మంత్రి ని కేటాయించకపోవడం సిగ్గుచేటు
–విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే చూస్తూ ఊరుకోం
–వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్.యు) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిడిఎస్.యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ హాజరై మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని అన్నారు. నేటికీ విద్యారంగ సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి విద్యా రంగంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు న్యాయబద్ధంగా రావలసిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందన్నారు. దీనితో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. రియంబర్స్మెంట్ రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను బలవంతంగా ఫీజులు కట్టెల ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల కాకపోవడంతో స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నడుస్తున్న చిన్న తరహా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూతకు గురవుతున్నాయన్నారు. కొన్ని బడా డిగ్రీ కళాశాలలు నాన్ దోస్తు కాలేజీలుగా అవతరించి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా విధానం అంతా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి పోయిందని దీంతో డిగ్రీ విద్య కూడా కార్పొరేట్ల వశమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు కెంసారపు రవితేజ, జిల్లా నాయకులు ఎండీ అస్లాం, కొయ్యడ బాబు, రాకేష్, అజయ్, చందు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

_———————–+++———————–
*పత్రికా ప్రకటనలు*
—————————————+-+————-

—————————++++++++++——————-

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.