
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తేది 31.01.2025(శుక్రవారం) డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటీఎఫ్)శంకరపట్నం మండల సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, ఎన్నికల అధికారిగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా కార్యదర్శి ఏబూషి శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ-కుబెర్లో ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని , పెండింగ్ డిఏలను విడుదల చేసి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన వారికి వచ్చే బెన్ఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటవెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ విద్యార్థులకు పెట్టే భోజనపు మెనూనే సాధారణ పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింప జేయాలని అన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో డిటిఎఫ్ మండల అధ్యక్షునిగా బొప్పరాజు రమేష్ , ప్రధాన కార్యదర్శిగా గోపు రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా V. రమేష్, B వసంత, కార్యదర్శులుగా R కుమారస్వామి, P శ్రీనివాస్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా K.V రామేశ్వర్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్స్గా R రవీంద్ర నాథ్, P సమ్మిరెడ్డి, K శివ ప్రసాద్, హుమేరా జబీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.


——————+++++———————
*పత్రికా ప్రకటనలు*
,———————–+++++——————-

—————————+++++++++——————–

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.