
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోనీ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ గయాసోద్దీన్ ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా హుజురాబాద్‌లోని మురాద్ నగర్ లో నివసిస్తున్న చిన్ననాటి మిత్రులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్ మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పూలదండలతో శాలువాలతో స్వీట్లు తినిపించి భారీ ఎత్తున పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ సయ్యద్ గయాసుద్దీన్ మొట్టమొదటగా అంబాల గ్రామంలో హైస్కూల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టి అనంతర కరీంనగర్ జిల్లా పరిషత్తులో మరియు హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దాదాపు 27 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో విధులు నిర్వహించి మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్నాడన్నారు. చిన్ననాటి మిత్రుడు ఈరోజు పదవి విరమణ చేయటం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి పనులు తాను చేసిన సేవలను గుర్తిస్తూ కష్టపడి ఇంత మంచి పేరు సంపాదించి ఇంత మంది సమక్షంలో పదవి విరమణ పొందటం చాలా అదృష్టం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. అనంతర తన చిన్ననాటి మిత్రుడు సయ్యద్ గయాసుద్దీన్ కు భారీ ఎత్తున సన్మానం చేసి పదవి విరమణ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి విరమణ చేసిన అనంతరం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని అక్కడ పదవి విరమణ చేసిన తోటి ఉద్యోగులందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని సయ్యద్ గయాసుద్దీన్ కు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు ఇతర మిత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అప్సర్, మహమ్మద్ సలీం, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ అబ్దుల్, ఎం ఏ అజీజ్, మీర్జా అఫ్జల్ బేగ్, మహమ్మద్ మజారుద్దీన్, మహమ్మద్ ఖాజా పాషా, మొహమ్మద్, మహమ్మద్ ఖాన్, సయ్యద్ ఫయాజుద్దీన్, ఎండి అమీన్ ఖాన్, మహమ్మద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ మాక్బుల్ హుస్సేన్, సయ్యద్ మకుసూద్, మహమ్మద్ బాబే, అజ్మతుల్లా ఖాన్, మహమ్మద్ నాజూర్ హుస్సేన్, చాంద్, మహమ్మద్ సలీం, సయ్యద్ సలీం, మహమ్మద్ రజాక్, మహమ్మద్ అజీజ్, మహమ్మద్ ఖాద్రి, సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



_——————++++——————-
*పత్రికా ప్రకటనలు*
————++++———————-

———————+++++++++———————-

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.