
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రేపు, ఎల్లుండి 1, 2 ఫిబ్రవరి 2025న రెండు రోజుల పాటు ముంబయి లోని ప్రియదర్శిని స్పోర్ట్స్ స్టేడియం ముంబయిలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు హుజురాబాద్ BBR కరాటే అకాడమికి చెందిన విద్యార్థి జూపాక సాయి సంతోష్ ఈ కరాటే పోటీలలో పాల్గొంటారన్నారు. అలాగే వివిధ దేశాల మరియు రాష్ట్రాల నుండి కరాటే విద్యార్థులు పాల్గొంటారని, ఈ కరాటే పోటీలు వరల్డ్ ఫునకోశి షోటోకన్ కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు భూసారపు బాపురావు, జిల్లా అధ్యక్షులు రొంటాల రాజ్ కుమార్ తెలిపారు. హుజురాబాద్ కరాటే అకాడమికి చెందిన విద్యార్థి సాయి సంతోష్ ఎంపిక పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందే రాధిక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ కరాటే మాస్టర్ బత్తుల సమ్మయ్య తదితరులు హర్షం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూసారపు బాపురావు, జిల్లా అధ్యక్షులు రొంటాల రాజ్ కుమార్ తెలిపారు.




———————–++++++——————–
‘పత్రికా ప్రకటనలు’
———————–+++++++——————-

————————++++++++——————–

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.