
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మా ఇల్లు మాకు కావాలంటూ హుజురాబాద్ జర్నలిస్టులు ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుండి కాంగ్రెస్ పార్టీ వార్తలను బహిష్కరిస్తున్నట్లు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ చేసినట్లు క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఈ ఆయన మాట్లాడుతూ…గత ఐదు రోజులుగా నివేశన స్థలాల సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 20 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సాధించుకున్న ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు కేసు వేసినప్పటికీ దానిని ఉపసంహరించడంలో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.
—మద్యం సిండికేట్ పై ఫిర్యాదు.
హుజురాబాద్ ప్రాంతంలో మద్యం మాఫియా సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా సిట్టింగ్ లను ఏర్పాటు చేస్తుందన్నారు. అదేవిధంగా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ దందా ను అరికట్టాలని ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మద్యం సిండికేట్ దందా పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, సత్యరాజ్, శ్రీనివాస్, జర్నలిస్టులు ఆంజనేయస్వామి, కిరణ్ కుమార్, నరసింహారెడ్డి, శ్రీధర్, రవీందర్, సతీష్, రాజు, సతీష్, స్వామి, చందు, టేకుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.




—————————-++++++++—————
*పత్రికా ప్రకటనలు*
——————-++++++———————

————————++++++++———————–

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.