
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తనకు ప్రజలు సహకరించాలని హుజురాబాద్ నూతన కమిషనర్ ఎన్ సమ్మయ్య అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతన కమిషనర్ గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన సల్వాది సమ్మయ్య సిరిసిల్లకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో తాను గతంలో నివసించానని తనకు పట్టణ సమస్యలన్నీటిపై అవగాహన ఉన్నాయని అన్నారు. గతంలో కన్నా మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రజలకు కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తూ మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అన్నారు. కాగా నూతన కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సమ్మయ్యకు మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, సానిటరీ అధికారి కిషన్ రావు, ఏఈ సాంబరాజు, ఉద్యోగులు వినయ్, శ్రీనివాస్, సానిటరీ జవాన్లు ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, పి అనిల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

—————-+++++———————
. *పత్రికా ప్రకటనలు*
—————+++++++———————

————————-+++++++++——————-

నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.