
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ జూన్ 8: అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి పార్థివ దేహాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, BRS Party అధినేత కేసిఆర్ మాదాపూర్ లోని నివాసంలో సందర్శించి, పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా శోకతప్తులైన గోపీనాథ్ భార్య, బిడ్డలను కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. కుమారుడు వాత్సల్యనాథ్ ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా మృదు స్వభావి సౌమ్యుడు ఆప్తుడుగా వున్న గోపీనాథ్ మరణం సందర్భంగా వారి పార్థివ దేహాన్ని చూసిన కేసీఆర్ కళ్ళు చెమర్చి, ఉద్వేగానికి గురయ్యారు. కెసిఆర్ వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు.



మృతుడు గోపీనాథ్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, ఉద్వేగానికి గురవుతున్న కేసీఆర్..



గోపీనాథ్ భార్య, పిల్లలను ఓదార్చుతున్న కెసిఆర్..

గోపినాథ్ భార్య, పిల్లలను ఓదార్చిన అనంతరం సంతాపం వ్యక్తం చేస్తున్న కేసీఆర్..





