
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వ్యాయామ ఉపాధ్యాయుడిగా క్రీడ రంగానికి సారయ్య చేసిన సేవలు అమోఘమని జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేసే పదవి విరమణ పొందిన సొల్లు సారయ్యకు సన్మాన అభినందన కార్యక్రమ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సారయ్య పిఈటిగా పీడిగా తన ఉద్యోగ పదవీ కాలంలో అనేకమంది పిల్లలను కబడ్డీ, ఖో ఖో, ఇతర క్రీడల్లో నిష్ణాతులను చేశారని అన్నారు ఎంతో మంది జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడలల్లో తమ ప్రతిభ చూపారని అన్నారు. అనంతరం సారయ్య మాట్లాడుతూ…తాను 40 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశానని, ఎల్లప్పుడూ మైదానంలో ఉంటూ పిల్లలను క్రీడల్లో నిష్ణాతులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. నా బాధ్యతగా భావించి ఎందరో క్రీడాకారులను తయారు చేశానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీనివాస్, పేట జాతీయ అధ్యక్షులు ఊసురెడ్డి, పాఠశాల హెచ్ఎం బొరగాల తిరుమల, ఈశ్వర్ రెడ్డి, ఆసియా, రాములు, సంపత్, మారుతి ప్రసాద్, హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ దళిత, ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



————————–++++++++—————-
*పత్రికా ప్రకటనలు*
——————–++++——–;;–;:;———

*నేటి నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన చిన్నలు, పెద్దలు, అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు మీ ప్రేమాభిమానాలతో… సొల్లు సారయ్య రిటైర్డ్ పిడి, జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) హుజురాబాద్.*