
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల పరిధిలో గల సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించగా ఉద్యోగాలకు 116 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం (ఫైనల్ ఇయర్) చదువుతున్న వివిధ బ్రాంచ్ లకు చెందిన 116 మంది విద్యార్థులు ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు ఎంపికయ్యారు. ప్రసిద్ధ డెల్ఫీ – టీవీఎస్ టెక్నాలజీస్ సంస్థ కళాశాలలో పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి 116 మంది విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కిట్స్ సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, డైరెక్టర్ డా. కందుకూరి శంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ వొడితల, ప్రిన్సిపాల్ డా. కె ఈశ్వరయ్య, రిజిస్ట్రార్ డా. వి. రాజేశ్వర్ రావు, ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ అధికారిణి కె. విజయలక్ష్మి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించారు.
నైపుణ్యాలు పెంచుకోవాలి : కిట్స్ డైరెక్టర్ డా. కందుకూరి శంకర్
కిట్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు 116 మందికి క్యాంపస్ ప్లేసెమెంట్స్ రావడంపట్ల కళాశాల డైరెక్టర్ డా. కందుకూరి శంకర్ హర్షం వ్యక్తం చేసారు. మంగళవారం అయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులు అకడమిక్ పరంగా మంచి మార్కులతో పాటు, బ్రాంచ్ కు సంబంధిచిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా నడుస్తున్న, పేరున్న అప్లికేషన్ లపై పట్టు, నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు కంపెనీలు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా.. ఇటు అకాడమిక్స్ లో ఉన్న సబ్జెక్టులతో పాటు ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన నైపుణ్యం కూడా పెంచుకోవాలని కోరారు.







