
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తాటిపాముల రాము జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచరుల సమక్షంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము ముందుగా కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు, స్వీట్లు పంపిణీ చేశారు. రాముకు కౌశిక్ అనుచరులు, ఆయన టీం సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మరెన్నో జన్మదిన వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాము మాట్లాడుతూ.. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వార్డులోని ప్రజా సమస్యల సాధనకు గత కొన్నాళ్లుగా కృషి చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో నన్ను కౌన్సిలర్ గా గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని రాము స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో తాటిపాముల రమేష్, బొంగోని సంతోష్ గౌడ్, అమ్జత్ ఖాన్, కల్లేపు అఖిల్, హర్షత్, ఇర్ఫాన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



