Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత పాతికేళ్ల, 30 ఏళ్ల క్రితం చిరుతల రామాయణం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో క్రేజీ ఉండేది. అలాంటి చిరుతల రామాయణం గ్రామీణ ప్రజలకు అలవోకగా నేర్పి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీపాద చంద్రయ్య(70) చిరుతల రామాయణం గురువు గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. ఆ విషయం తెలియగానే చిరుతల రామాయణం నేర్చుకున్న అతనికి శిష్యులు, అతని అభిమానులు ఆయన అంత్యక్రియలో పాల్గొనడం కాక ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. చంద్రయ్య చిరుతల రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా నాటి రామాయణాన్ని ప్రజలకు ప్రదర్శించి భక్తి పారవశ్యంలో మునిగి పోయేలా చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పౌరాణిక నాటక కళారంగాన్ని కొన్నేళ్లపాటు కొనసాగించారు. అతని వారసత్వంగా పెద్ద కుమారుడైన రమేష్ పలు కలలను నేర్చుకున్నాడు. అంతేగాక డోలక్ వాయించడంలో ఎంతో నేర్పరి. ఆయన అనేకచోట్ల భజన పోటీలకు వెళ్లి తన డొలక్ విన్యాసాన్ని ప్రదర్శించి జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్నారు. రమేష్ తండ్రి చంద్రయ్య మృతి చెందాడన్న విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మేకల తిరుపతి, బిజెపి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు మోతే తిరుపతి, సీనియర్ జర్నలిస్టు మండల యాదగిరి, తాజా మాజీ వార్డ్ కౌన్సిలర్ భాషబోయిన వనితా కుమార్ యాదవ్, ఆ గ్రామ మాజీ సర్పంచులు ఆకుల మొగిలి, గుంటి మల్లయ్య, సీనియర్ కళాకారులు, జర్నలిస్టులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

చిరుతల రామాయణం (ఫైల్ ఫోటో లు)






