
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి స్వయంభు శ్రీ మత్స్యగిరీంద్రస్వామి ఉత్సవ కమిటీ పోస్టర్ ను ఛైర్మన్ సారబుడ్ల వెంకట్ రెడ్డి, కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేది నుంచి 19 వరకు అభిషేకం, కళ్యాణ మహోత్సవం, శకటోత్సవం, నాకబలి, గ్రామపర్యటనతో జాతర కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిల్లా వెంకట్ రెడ్డి, కొంపెల్లి సుధాకర్ రెడ్డి, కారోబార్ రాజేందర్, కొంపెల్లి తిరుపతిరెడ్డి, అజ్జల మల్లారెడ్డి, కంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వెన్నం భగవాన్ రెడ్డి, కుప్పి రత్తయ్య, పైడిపల్లి లింగయ్య, పైడిపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
