
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఇరువురు మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను తాజా మాజీ ఎంపీపీ తిరుమల రాణి సురేందర్ రెడ్డి సందర్శించి వారిని పరామర్శించి ఒక్కొక్కరికి 5000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సమ్మెట సదయ్య మరణించగా ఆయన కుటుంబాన్ని వెళ్లి రాణి సురేందర్ రెడ్డి సందర్శించి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే మాట్ల రాధ నిన్న మరణించగా వారి కుటుంబాన్ని వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డి అందజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు తన వంతుగా కృషి చేస్తానని, ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని వారికి హామీ ఇచ్చారు. కాగా మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డి వెంట మాజీ ఎంపీటీసీ పి సదానందంగౌడ్, మాజీ ఉపసర్పంచ్ జయసుధ వాసుదేవరెడ్డి, రాజు, అశోక్, విశ్వనాధ్, రాకేష్, రమేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

