
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అలుపెరుగని పోరాటం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. శనివారం అయిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. గత నాలుగో తారీఖు అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఎస్సీ వర్గీకరణ మూడు విడతలుగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారన్నారు. మొదటి గ్రూపులో.a. 15 కులాలను చేర్చి 1శాతం (1పర్సెంట్) రిజర్వేషన్ కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా ఈ 15 కులాల్లో రెండు కులాలు ఆర్థికంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా ముందు వరుసలో ఉన్నాయనీ, దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని, మొదటి గ్రూపులో ఈ రెండు కులాలను తొలగించి అన్ని రంగాలలో వెనుకబడిన కులాలైన దాసరి, హోలియా దాసరి కులాలను చేర్చి వర్గీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని వేణు పేర్కొన్నారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారన్నారు. వెంటనే ఉపకులాల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆర్థికంగా, విద్య పరంగా, ఉద్యోగపరంగా, ఉపాధిపరంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడిపోయిన a కేటగిరి లో ఉన్న 13 కులాల్లో మేజర్ కులమైన బేడ బుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని, ప్రత్యేకంగా పదివేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర నలు మూలల నుండి వివిధ పనుల విషయంలో హైదరాబాద్ కు వచ్చి రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ప్లాట్ ఫాం పైన ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్న మా బేడ బుడగ జంగాలకు వెంటనే హైదరాబాదులో వెయ్యి గజాల స్థలం ఇచ్చి కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా బేడ బుడగ జంగాలు 80% మంది పూరి గుడిసెలలో నివసిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 20 శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో (20 శాతం) మా బేడ బుడగ జంగాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. పైన తెలిపిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ, లేనిపక్షంలో తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని వేణు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్తం అంజనేయులు రాష్ట్ర కోశాధికారి డొక్కా రాజేష్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వానరాశి గిరి వెంకటి, రాష్ట్ర నాయకులు చింతల అంజి, కార్యవర్గ సభ్యులు పస్తం రమేష్, పురాణం రమేష్, ఊపిది రమేష్, కళ్లెం చిన్న గంగారం, కళ్లెం రాజారాం, కళ్లెం మహేందర్, మౌటం తిరుపతి, కళ్లెం శ్రీనివాస్, సిరిగిరి రాజయ్య, భూపతి రాజు, నూనె మల్లయ్య, ఉరా కుమార్, ఊర అనిల్ గంధం మధు తదితరులు పాల్గొన్నారు.



