
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
శనివారం రోజున తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ ..
ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డికి మరియు మూడు శతాబ్దాల కాలం నిరంతరం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి సాధించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఎస్టీ జనాభా ప్రతిపాదిక మీద కాకుండా విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి అసమానతలకు గురైన ఎస్టి తెగలను గుర్తించి ఎస్టిలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరుకల జాతి అభివృద్ధి కోసం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల బడ్జెట్ ఇస్తామని అన్నారు, ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇతర గిరిజనులను గుర్తించినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించడము లేదని ఆవేదన వ్యక్తపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడా, కోయ, గోండు తెగలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
ట్రై కార్ సంస్థకి 2024 – 25 సంవత్సరానికి గాను 360 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఇంతవరకు కూడా మా ఎరుకల జాతికి ఒక్క రూపాయి కూడా అందలేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొంత మేరకు ఎరుకల జాతికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హాయంలో ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ప్రకటించారని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఎమ్మెల్సీ అవకాశం రాకుండా పోయిందన్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుకల జాతిని గుర్తించి ఎమ్మెల్యేలల కోట కింద ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఎకరం భూమి 3.5 కోట్లతో ఎరుకల ఆత్మ గౌరవ భవనం నిర్మించినారని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎరుకల ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినారు అట్టి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు లోకిని చందర్, పులిచేరు రవీందర్, దేవరాయ సమ్మయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనేటి సమ్మయ్య, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, వరంగల్ మండల అధ్యక్షుడు పాలకుర్తి నారాయణ, హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు పులిసేది సారయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడు శ్రీనివాస్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్, భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అంగడి ప్రశాంత్, సంగేo మండల అధ్యక్షులు పల్లకొండ బిక్షపతి, సొసైటీ డైరెక్టర్ రాయపురం, పరకాల మండల అధ్యక్షులు కేతిరి సాంబయ్య, శ్రీనివాస్, మేరగుత్తి రఘు, పులిచేరు వేణు, పులిచేరు గణేష్, పులిచేరు రామకృష్ణ, మానుపాటి రాజు, రాయపురం సంపత్, డాక్టర్ కూతాడి సూర్యం, కట్ట పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

