
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలలో హుజురాబాద్ ఫుట్బాల్ జట్టు రెండో స్థానం పొందింది. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ క్రీడల్లో 8 జట్లు పాల్గొనగా ఫైనల్ పోటీలో ప్రథమ స్థానం డోర్నకల్ ఉండగా ద్వితీయ స్థానం హుజురాబాద్ జట్టు పొందింది. కాగా హుజురాబాద్ ఫుట్బాల్ జట్టు దామెర రాము, గోస్కుల కిషోర్ , బండ కోశన్ ల పర్యవేక్షణలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందడం పట్ల క్రీడాకారులు కొలిపాక శ్రీనివాస్, బండ శ్రీనివాస్, చింత శ్రీనివాస్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, పీవీ జిల్లా సాధన సమితి నాయకుడు సదానందం లు ఫుట్బాల్ క్రీడాకారులు సాయి రాకేష్, అనిల్, శ్రీరామ్, ఇర్ఫాన్, అభి, జై, జానీ, టింకు, వెంకీ, చింత హనీష్ చంద్రలను అభినందించారు.

