
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెల్ఫ్ హెల్త్ గ్రూప్ సభ్యులకు మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎన్హెచ్ఓ డాక్టర్ చందు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
మామిళ్లవాడ పల్లె దవాఖాన వైద్యాధికారిణి డాక్టర్ జహ్రు మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా గర్భాశయ మరియు వక్షోజాల క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పారు. తొలి దశలోనే క్యాన్సర్లను నిరోధిస్తే చికిత్స సులువవుతుందని, త్వరగా కోలుకోవచ్చని అని చెప్పారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ పంజాల ప్రతాప్ మహిళలకు ప్రాథమిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ హెల్త్ గ్రూపు ఏపీవో తిరుపతి, సభ్యులు, అంగన్వాడి సూపర్వైజర్లు పద్మ, రమాదేవి, హెల్త్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు.


