
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓ కరీంనగర్ ఆదేశాల మేరకు సోమవారం బాలబాలికలకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, ప్రాంతీయాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంవోలు డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలబాలికల కంటి చూపు సరిగా ఉంటేనే పాఠాలను పుస్తకాలలో సరిగా చూసి చదువుకోగలుగుతారని అందుకే బాలబాలికలందరికి ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలను సరఫరా చేస్తామని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఎస్ కే సిబ్బంది, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.

